సనత్ నగర్ ప్రాజెక్టు పై సమీక్ష సమావేశం 06.01.2020

జలమండలి ఎండీ ఎం. దానకిషోర్, ఐఏఎస్ గారు సనత్ నగర్ నియోజకవర్గంలో సెవరెజీ, మంచినీటి సరఫరా, రెవెన్యూ, వాక్ కార్యక్రమాల పైలెట్ ప్రాజెక్టుపై తేది. 06.01.2020, సోమవారం రోజున ఎస్ఆర్ నగర్ లోని ఐవా కార్యాలయంలో జలమండలి ఉన్నతాధికారులు, ఎన్జీవో ప్రతినిధులు, లైన్ మెన్లు, వాక్ వాలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ ఇంటింటి సర్వే, ప్రతి ఇంటికి రంగుల కేటాయింపు త్వరగా పూర్తిచేయాలన సూచించారు. ఇంటింటి సర్వే, వాక్ కార్యక్రమాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు అమలు తీరుతెన్నులను ఎన్జీవోలు, వాక్ వాలంటీర్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ ప్రాజెక్టులో లైన్ మెన్లు ముఖ్య పాత్ర వహిస్తారని ఎండీ తెలిపారు. లైన్లమెన్ల సేవలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి ఇంటికి రంగుల కేటాయింపు తప్పనిసరిగా చేపట్టాలన్నారు. ప్రతి కనెక్షన్ నీటి వృథాను ఆరికట్టేందుకు నల్లా బిగింపు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సెవరెజీ ఓవర్ ఫ్లోను తగ్గించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే మంచినీటి పైపులైనులలో లీకేజీలు కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెవరెజీ పూడికలు తీసేందుకు సెవర్ క్రాక్ యంత్రాలను సనత్ నగర్ లో పైలెట్ ప్రాజెక్టుగా వినియోగించనున్నట్లు వివరించారు. అధికారులను అడిగి సెవర్ క్రాక్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే సెవరెజీ, మంచినీటి పైపులైను మ్యాపింగ్, వాల్వూలకు జియోట్యాగింగ్, మంచినీటి సరఫరా సమయాలను వినియోగదారుల మొబైల్ కు మెసేజ్ వంటి కార్యక్రమాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
రెవెన్యూకి సంబంధించి ప్రతి క్యాన్ కు వంద శాతం బిల్లింగ్, వంద శాతం కలెక్షన్ల జరిగేలా చూడాలన్నారు. డాకెట్ ల వారీగా రిపోర్టులు సమర్పించాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జలమండలి ఆపరేషన్స్-2 డైరెక్టర్ పి.రవి, టెక్నికల్ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్ లతో పాటు సంబంధిత సీజీఎమ్ లు, జీఎమ్ లు పాల్గొన్నారు.
సేవలు

English A+ AA- A A
24గం. వినియోగదారుల సేవా కేంద్రం: 155 313
040- 23300114 & 23433933
customer-support@hyderabadwater.gov.in