మార్చి31 నుంచి శివారు ప్రాంతాల సెవరెజీ నిర్వహణ 08.01.2020

  • మంత్రి కేటీఆర్ ఆదేశంతో ఇక శివారు మురుగు నిర్వహణ
  • రెవెన్యూ వసూలులో నిర్లక్ష్యం వద్దు
  • ఇంటింటి సర్వేలో కనెక్షన్ల ఛార్జీల ద్వారా దాదాపు రూ. 11.4 కోట్ల ఆదాయం
  • నెలనెల బిల్లుల రూపంలో రూ.28.40 లక్షల అదనపు ఆదాయం
  • వాక్ కార్యక్రమం సమర్ధవంతంగా నిర్వహిస్తే జాతీయ గుర్తింపు
  • సమీక్ష సమావేశంలో జలమండలి ఎండీ ఎం. దానకిషోర్

జలమండలి ఎండీ  ఎం. దానకిషోర్, ఐఏఎస్ గారు రెవెన్యూ,ఎన్ఆర్ డబ్ల్యూ, విడిఎస్, వాక్, ఓఆర్ఆర్ పెవరెజీ వ్యవస్థలపై జలమండలి అధికారులతో తేది. 08.01.2020, బుధవారం రోజున ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎండీ మాట్లాడుతూ వాక్ కార్యక్రమంలో భాగంగా బ్రాండింగ్ (ప్రతి ఇంటికి  మంచినీటి వాడకంపై కేటాయించే  రంగు గుర్తులు) ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మంచినీటి సరఫరాల మొదలైన 5 నుంచి 15 నిమిషాలు నీటిని వృథాగావదిలేస్తున్న ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో నీటి వృథాను ఆరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో నివేదిక రూపొందించమని సూచించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని నీటివృథాపై అవగాహాన కార్యక్రమాలు మరింతగా చేపట్టి నీటివృథాను తగ్గించాలని సూచించారు. సెవరెజీ, మంచినీటి సరఫరా కలిసి ఉన్నప్రాంతాల్లో మంచినీటిలో మురుగునీరు కలిసే అవకాశం ఉంటుందని, ఆ ప్రాంతాలను గుర్తించి ఆయా పైపులైన్లకు మరమ్మత్తులు చేయడానికి అంచనాలు  రూపొందించాలని ఆదేశించారు. అలాగే మంచినీటి సరఫరాలో పైపులైను, వాల్వూల దగ్గర సైతం వృథా పోయే నీటిని ఆరికట్టడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  వాక్  కార్యక్రమం దేశంలో ఏ నగరం ఇప్పటీవరకు అనుసరించాలేని కార్యక్రమామని తెలిపారు. ఈ వాక్ ను సమర్ధవంతంగా అమలు చేస్తే జలమండలికి ఇంకా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. 

అలాగే రెవెన్యూ పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా ఇప్పటీవరకు బకాయిఉన్న వాణిజ్య కనెక్షన్లను గుర్తించి ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రతినెల బోర్డుకు రూ. 20 కోట్ల ఆదాయం సమకూరనుందని ఎండీ తెలిపారు. ఈనెల నుంచే ప్రతినెల సరాసరి రెవెన్యూతో పాటు అదనంగా 30శాతం వాణిజ్య  బకాయిల బిల్లుల వసూలును లక్ష్యంగా నిర్దేశించారు.  రెవెన్యూ వసూలులో ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఎండీ అధికారులను హెచ్చరించారు.

విడిఎస్-2019 ద్వారా ఇప్పటీ వరకు దాదాపుగా 3090  అక్రమ నల్లా కనెక్షన్ దారుల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీరికి త్వరలోనే క్యాన్ నెంబర్లు కేటాయిస్తామని వివరించారు. విడిఎస్-2019 వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 వరకు అమలులో ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున జరిమానాలు, క్రిమినల్ కేసుల బారిన పడకుండా ఉండేందుకు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని ఎండీ మరోసారి నగరవాసులను కోరారు.  విడిఎస్ పై మరింత అవగాహాన కల్పించేందుకు మరిన్ని బృందాలతో ప్రత్యేక క్యాంపులు చేపట్టాలని సూచించారు. అలాగే క్షేత్రస్థాయిలో ఆటోలు ద్వారా ప్రచారం చేపట్టాలన్నారు.

వీటితో పాటు ఇంటింటి సర్వేలో ఇప్పటి వరకు ఆరు డివిజన్ల పరిధిలో 91,783 కనెక్షన్లను సర్వే చేయగా ఇందులో 4870 కమర్షియల్ కనెక్షన్లు, 1452 ఎంఎస్ బీ కనెక్షన్లు, 1552 అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినట్లు తెలిపారు.  దీంతో ఒకేసారి కనెక్షన్ ఛార్జీల రూపంలో దాదాపుగా రూ.  11.40 కోట్లు,  నెలనెల నల్లా బిల్లు ద్వారా దాదాపు రూ. 28.40లక్షల ఆదాయం సమకూరుతుందని వివరించారు.

అంతేకాకుండా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి సూచనలతో మార్చి 31 నుంచి ఓఆర్ఆర్ వరకు సెవరెజీ వ్యవస్థ నిర్వహణ బాధ్యతలను జలమండలినే చేపట్టనున్నట్లు తెలిపారు. శివారు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ వద్ద ఉన్న   ఎయిర్ టెక్ యంత్రాలు, మినీ ఎయిర్ టెక్ యంత్రాలు, సెవరెజీ నిర్వహణ పద్దతులు, కార్మికుల వివరాలు, మౌళిక వసతులకు సంబంధించి అధ్యయనం చేసి రిపోర్టు సమర్పించాలని ఎండీ సూచించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో సెవరెజీ నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. అలాగే ఓఆర్ఆర్ ప్రాంతాల్లో సెవరెజీ ఫిర్యాదులకు అనుసరించాల్సిన  ప్రణాళికలు రూపొందిచాలని ఎండీ ఆదేశించారు. మానవ రహిత పారిశుద్ద్య పనులతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జలమండలి ఈ శివారు ప్రాంతాల్లోని పారిశుద్ద్యం పనులు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సాయంతో సమర్ధవంతంగా నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం. సత్యనారాయణ, ఆపరేషన్స్  డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి. రవి, టెక్నికల్ డైరెక్టర్ వి. ఎల్. ప్రవీణ్ కుమార్ లతో పాటు సంబంధిత సీజీఎమ్ లు, జీఎమ్ లు, డీజీఎమ్ లు, మేనేజర్లు పాల్గొన్నారు.

 


సలహాలు/సూచనలు